బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 09:05:08

కూర‌గాయ‌లు అమ్మే మ‌హిళ‌.. ఇంగ్లీష్‌లో దంచేసింది : వీడియో వైర‌ల్‌

కూర‌గాయ‌లు అమ్మే మ‌హిళ‌.. ఇంగ్లీష్‌లో దంచేసింది :  వీడియో వైర‌ల్‌

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సిటీలో కూర‌గాయ‌లు అమ్మే రైసా అన్సారీ అనే మ‌హిళ త‌న ఇంగ్లీష్ బాషా వాక్ చాతుర్యంతో అంద‌ర్నీ స్ట‌న్ చేస్తున్న‌ది.  తోపుడు బండిలో కూర‌గాయ‌లు అమ్మే ఆ మ‌హిళ‌.. మున్సిప‌ల్ అధికారుల తీరు ప‌ట్ల ఆగ్ర‌హంగా ఉన్న‌ది.  రోడ్డు వైపు కూర‌గాయ‌లు అమ్మే బండ్ల‌ను తొల‌గిస్తున్న స‌మ‌యంలో.. రైసా అధికారుల్ని అడ్డుకున్న‌ది.  అన‌ర్గ‌ళంగా ఆంగ్ల భాష‌లో మాట్లాడుతూ అధికారుల‌ను నిలదీసింది.  ఆ స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పింది. ఇండోర్ సిటీలోని దేవి అహల‌య్యా యూనిర్సిటీలో పీహెచ్‌డీ చేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించింది. మెటీరియల్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన‌ట్లు పేర్కొన్న‌ది.  

మున్సిప‌ల్ అధికారుల వైఖ‌రిని నిర‌సిస్తూ ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల కూర‌గాయ‌లు, పండ్లు అమ్మేవారి ప‌రిస్థితి దారుణంగా త‌యారైన‌ట్లు చెప్పింది. పీహెచ్‌డీ చ‌దివినా త‌న‌కు ఉద్యోగం ఎవ‌రూ ఇవ్వ‌లేద‌న్న‌ది. ఇంకా ఆమె ఎన్నో ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పింది. ఆమె మాట‌ల‌ను ఈ వీడియోలో వినండి. logo