మంగళవారం 31 మార్చి 2020
National - Feb 22, 2020 , 01:41:51

‘ఫిజికల్‌ టెస్ట్‌' పేరుతో నగ్నంగా నిలబెట్టారు!

‘ఫిజికల్‌ టెస్ట్‌' పేరుతో నగ్నంగా నిలబెట్టారు!
  • సూరత్‌ మున్సిపాలిటీలో పది మంది మహిళా క్లర్క్‌లకు చేదు అనుభవం

సూరత్‌: గుజరాత్‌లోని భుజ్‌లో ఓ హాస్టల్‌లో రుతుస్రావంలో ఉన్న యువతులను గుర్తించేందుకు లో దుస్తులు విప్పించిన ఘటన మరువక ముందే, అదే రాష్ట్రంలోని సూరత్‌లో మరో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. సూరత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో శిక్షణలో ఉన్న  పదిమంది మహిళా క్లర్క్‌లను శారీరక దృఢత్వ పరీక్ష(ఫిజికల్‌ టెస్ట్‌) కోసం ఒకే గదిలో నగ్నంగా నిలబెట్టి పరీక్షించడం వివాదాస్పదమైంది. క్లర్క్‌గా శాశ్వత నియామకానికి ముందు మూడేండ్ల శిక్షణ పొందాలి. తర్వాత తప్పనిసరిగా హాజరవ్వాల్సిన ఈ పరీక్ష కోసం గురువారం పదిమంది క్లర్క్‌లు సూరత్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూరత్‌ మున్సిపల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ దవాఖానకు వెళ్లారు. అక్కడ ఒక్కొక్కరినీ విడివిడిగా పరీక్షించాల్సి ఉండగా, పది మందిని ఒకేసారి గదిలోకి పిలిచిన మహిళావైద్యులు దుస్తులు విప్పించి పరీక్షించారు. పెండ్లికాని మహిళలకు సైతం గర్భనిర్ధారణ పరీక్షలు చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణకు కమిటీని నియమించినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. 


logo
>>>>>>