శనివారం 11 జూలై 2020
National - Jun 20, 2020 , 16:39:14

గూగుల్ మ్యాప్ ద్వారా 43 ఏండ్ల త‌ర్వాత ఇంటికి చేరుకున్న బామ్మ‌

గూగుల్ మ్యాప్ ద్వారా  43 ఏండ్ల త‌ర్వాత ఇంటికి చేరుకున్న బామ్మ‌

43 ఏండ్ల క్రితం కుటుంబానికి దూర‌మైన ఓ బామ్మ గూగుల్ మ్యాప్ ద్వారా ఇంటికి చేరుకున్న‌ది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో 43 ఏండ్ల క్రితం త‌ప్పిపోయిన పంచుబాయ్ అనే మ‌హిళ‌ను నూర్ ఖాన్ అనే వ్య‌క్తి చేర‌దీశాడు. ఎన్నిసార్లు అడిగినా వివ‌రాలు చెప్ప‌లేక పోయిన ఆమె బాగోగుల‌ను నూర్ ఖాన్ చూసుకుంటూ వ‌చ్చాడు. కొన్నేండ్ల‌కు ఆయ‌న‌ కూడా మ‌ర‌ణించాడు. దీంతో కుటుంబం ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుండ‌టంతో నూర్ ఖాన్ కుమారుడు ఇష్రార్ ఖాన్ ఆమె వివ‌రాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నం చేశాడు.

వివ‌రాలు అయితే చెబుతుంది కానీ, మాట‌లు స్ప‌ష్టంగా లేక‌పోవ‌డంతో అర్థం చేసుకోవ‌డానికి క‌ష్టంగా ఉన్న‌ది. దీంతో ఇష్రార్ ఆమె మాట‌ల‌ను గూగుల్ మ్యాప్‌లో రికార్డ్ చేసి సెర్చ్ చేశాడు. దీని ద్వారా ఆమెది కంజమ్‌ నగర్‌ అని అతడికి తెలిసింది. గూగుల్‌లోనే ఆ గ్రామ అధికారి ఫోన్‌ నంబర్‌కు కాల్ చేసి ఆమె వివ‌రాలు తెలుసుకున్నాడు. బామ్మ ఫొటోను అత‌నికి పంప‌డంతో వారు గుర్తుప‌ట్టారు. విషయం తెలుసుకున్న ఆమె మనవడు పృథ్వీరాజ్ షిండే వెంటనే ఇష్రార్ ఖాన్ ను సంప్రదించి నానమ్మను ఇంటికి తెచ్చుకున్నాడు. ఇన్నేండ్లు ఆమెకోసం ఎదురుచూసి తండ్రి, తాత‌య్య మ‌ర‌ణించార‌ని షిండే చెప్పుకొచ్చాడు. 

  


logo