శనివారం 04 జూలై 2020
National - Jun 26, 2020 , 16:06:02

చెత్తతో నాలుగేండ్లలో 6.5 కోట్లు సంపాదన

చెత్తతో నాలుగేండ్లలో 6.5 కోట్లు సంపాదన

ఛత్తీస్‌గఢ్‌ : చెత్తే కదా అని లైట్‌ తీసుకొన్నారో అది మీకు లక్షల్లో సంపాదన రాకుండా చేస్తుంది. గ్రామంలోని మహిళలంతా ఏకమై ఇంట్లో నుంచి జమచేసిన చెత్తతో నాలుగేండ్లలో ఆరున్నర కోట్లు సంపాదించారు. దాంతో పాటు ఇండోర్‌ తర్వాత అత్యంత స్వచ్ఛ గ్రామంగా నిలిపారు. మూడుసార్లు జాతీయ స్థాయిలో స్కోచ్‌ అవార్డును అందుకున్న ఈ అంబికాపూర్ పేరు.. పరిశుభ్రతతోపాటు మహిళల సాధికారతకు నిదర్శనంగా నిలించింది. 

ప్రపంచానికి చెత్త ఇబ్బంది కలిగిస్తుంది, కాని ఆ చెత్తే ఆదాయ వనరుగా మారుతుందని నాలుగేండ్ల క్రితం కలెక్టర్‌ రితూ సన్‌.. అంబికాపూర్‌ గ్రామ మహిళల్ని ఏక తాటిపైకి తీసుకొచ్చారు. స్వయం సహాయక బృందం ఏర్పాటుచేసి వారికి వ్యర్థాల నిర్వహణలో శిక్షణ ఇప్పంచింది. నగరంలోని 27 వేల ఇండ్లలో ఇంటింటికి తిరుగతూ వ్యర్థాలను సేకరిస్తారు. అనంతరం 20 ఎస్‌ఎల్‌ఆర్‌ఎం కేంద్రాల్లో క్రమబద్ధీకరిస్తారు. పొడి వ్యర్థాలను క్రమబద్ధీకరించిన తరువాత 155 రకాల వ్యర్థాలను విడుదల చేస్తారు. నగరంలోని ప్రతి ఇంటి నుంచి రూ .50, వ్యాపార సంస్థల నుంచి రూ .100 వినియోగదారుల ఛార్జీ వసూలు చేస్తారు. మహిళల ఇంటింటికి చెత్త సేకరణ కారణంగా నగరంలో డంపింగ్ యార్డ్ లేదు. మురుగు వాసనా లేదు. ఇక్కడి 40 సంవత్సరాల పురాతన డంపింగ్ యార్డ్ అందమైన పార్కుగా మారింది. 

పొడి వ్యర్థాలు ఇక్కడి మహిళలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. ఇలా నాలుగు సంవత్సరాల్లో సేకరించిన వ్యర్థలను జంకీలను విక్రయించడం ద్వారా ఆరున్నర కోట్ల వరకు సంపాదించారు. ఈ పొడి వ్యర్థాల నుంచి అందుకున్న మొత్తం నుంచి  450 మంది మహిళలకు క్లీన్ అంబికాపూర్ మిషన్ ఫెడరేషన్ ద్వారా ప్రతి నెలా రూ.6 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. మునిసిపల్ కమిషనర్ హరేష్ మాండవి మాట్లాడుతూ, మహిళల కారణంగా, అంబికాపూర్ మోడల్ మొత్తం రాష్ట్రంలోని పట్టణ సంస్థలలో వర్తిస్తుందని, దేశంలోని అనేక నగరాల ప్రతినిధులు ఈ నమూనాను అధ్యయనం చేయడానికి వస్తున్నారని చెప్పారు.


logo