మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 20:11:29

జవాన్లకు రాఖీలు కట్టిన మహిళలు

జవాన్లకు రాఖీలు కట్టిన మహిళలు

న్యూఢిల్లీ: దేశం కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు మహిళలు రాఖీలు కట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్ముకశ్మీర్, లఢక్ సరిహద్దుల వద్ద విధులు నిర్వహించే ఆర్మీ, పారామిలిటరీ బెటాలియన్స్‌కు చెందిన జవాన్లకు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళలు రాఖీలు కట్టారు. మరోవైపు జమ్ముకశ్మీర్ ఆర్ఎస్ పురాలోని పాక్ సరిహద్దు వద్ద విధుల్లో ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బందికి స్థానిక మహిళలు ఆదివారం రాఖీలు కట్టారు.

logo