ఆదివారం 07 మార్చి 2021
National - May 05, 2020 , 16:52:06

మహిళలతో బలవంతంగా మూత్రం తాగించి, గుండ్లు కొట్టిన వైనం

మహిళలతో బలవంతంగా మూత్రం తాగించి, గుండ్లు కొట్టిన వైనం

ముజఫర్‌నగర్‌ : కొంతమంది వ్యక్తులు కలిసి ముగ్గురు మహిళల చేత బలవంతంగా మూత్రం తాగించారు. ఆనక ముగ్గురికి గుండు కొట్టించారు. ఈ దారుణ సంఘటన బిహార్‌లోని ముజఫర్‌ జిల్లా దాక్‌రామా గ్రామంలో నిన్న చోటుచేసుకుంది.  చేతబడి చేస్తారనే ప్రచారంతో ముగ్గురిపై మంత్రగత్తెలుగా ముద్ర వేశారు. మహిళల చేత మూత్రం తాగించడం, గుండు గీయించడం వంటి సన్నివేశాలతో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరస్‌ అయింది. 2 నిమిషాల 20 సెకన్లు ఉన్న ఈ వీడియోను ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్‌జేడీ) సైతం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనకు కారణమైన 10 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో తొమ్మిదిమందిని నేడు అరెస్ట్‌ చేసినట్లుగా ఏఎస్పీ అమితేష్‌ కుమార్‌ తెలిపారు. కాగా మహిళలకు గుండ్లు కొట్టిన వ్యక్తి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బాధిత మహిళలు గానీ, గ్రామస్తులు కానీ జరిగిన విషయంపై ఫిర్యాదు చేయలేదన్నారు. మీడియా ద్వారా విషయం తెలిసి చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.

VIDEOS

logo