బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 15:54:14

మహిళలకు ఉచితంగా చారిత్రక కట్టడాల సందర్శన

మహిళలకు ఉచితంగా చారిత్రక కట్టడాల సందర్శన

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా నేడు భారత పురావస్తు శాఖ పరిధిలోని చారిత్రక కట్టడాలను మహిళలు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. మహిళలు ఇవాళ ఎలాంటి ప్రవేశరుసుం, టికెట్లు లేకుండా దేశంలోని స్మారక, చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. logo