శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 07:58:37

వైద్య‌సిబ్బంది కోసం మ‌హిళా ఈ-రిక్షా డ్రైవ‌ర్ల‌కు అనుమ‌తి

వైద్య‌సిబ్బంది కోసం మ‌హిళా ఈ-రిక్షా డ్రైవ‌ర్ల‌కు అనుమ‌తి

మ‌ధ్య‌ప్ర‌దేశ్ : విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న వైద్యారోగ్య సిబ్బందిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డం కోసం మధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇండోర్ లో మ‌హిళా ఈ రిక్షా డ్రైవ‌ర్ల‌కు అనుమ‌తినిచ్చింది. మహిళా డ్రైవ‌ర్ రేఖా యుకే మాట్లాడుతూ..అధికారులు మాకు పాసులు ఇచ్చి, స‌ర్వీసులు న‌డిపేందుకు అనుమ‌తి ఇచ్చారు. దీంతో తాము ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయ‌డమే కాకుండా కొంత డ‌బ్బు కూడా సంపాదించుకుంటున్నామ‌ని చెప్పింది.

ఇండోర్ నోడ‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ అమిత్ మ‌ల‌క‌ర్ మాట్లాడుతూ..ఇండోర్ లో ప్ర‌స్తుతం 21 ఈ-రిక్షాలు న‌డుస్తున్నాయి. ఒక‌వేళ మ‌హిళా డ్రైవ‌ర్ల‌కు శానిటైజ‌ర్లు, మాస్కులు, చేతి గ్లౌసులు అవ‌స‌ర‌మైతే మేం అంద‌జేస్తున్నాం. వాహ‌న స‌దుపాయం లేని వైద్యారోగ్య సిబ్బంది స‌ర్వే చేసేందుకు, విధులు నిర్వ‌ర్తించేందుకు ఈ-రిక్షాలు చాలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని తెలిపారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo