మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 19:06:43

మేఘాలయలో విరిగిపడ్డ కొండచరియలు.. మహిళా క్రికెటర్‌ మృతి

మేఘాలయలో విరిగిపడ్డ కొండచరియలు.. మహిళా క్రికెటర్‌ మృతి

షిల్లాంగ్‌ : మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడగా ఓ మహిళా క్రికెటర్‌ మృతి చెందగా, మరో ఐదుగురి ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. మావ్నీ ప్రాంతంలో ఉదయం 6 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో అనేక జాతీయ టోర్నమెంట్లలో మేఘాలయ తరఫున ప్రాతినిథ్యం వహించిన మహిళా క్రికెటర్ రజియా అహ్మద్ మృతదేహాన్ని శిథిలాల వెలికితీసినట్లు మావ్నీ ప్రాంతీయ అధిపతి బాహ్ బడ్ పేర్కొన్నారు.

ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ సిల్వెస్టర్ నాంగ్టింగర్ మాట్లాడుతూ.. ప్రమాదం గురించి సమాచారం వచ్చిన వెంటనే పోలీసు బృందం, హోంగార్డుల బృందం సహాయ చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. మేఘాలయ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గిడియాన్ ఖార్కోంగోర్ మాట్లాడుతూ 2011-12 నుంచి రాష్ట్రానికి వెలుపల వివిధ టోర్నమెంట్లలో రజియా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిందని పేర్కొన్నారు. ఆమె ఆకస్మిక మరణానికి సహచరులు సంతాపం తెలిపారు. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo