బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 03, 2020 , 22:00:44

కా‌ర్వా చౌత్.. మెహందీతో సిద్ధ‌మౌతున్న మ‌హిళ‌లు

కా‌ర్వా చౌత్.. మెహందీతో సిద్ధ‌మౌతున్న మ‌హిళ‌లు

ఢిల్లీ : కార్వా చౌత్ అనేది ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన హిందూ మ‌హిళ‌లు జ‌రుపుకునే పండుగ‌. కార్వా చౌత్ పండుగను నార్త్ ఇండియాలో మ‌హిళ‌లు ఆనందోత్స‌హాల మ‌ధ్య‌ ఎంతో వేడుక‌గా జరుపుకుంటారు. కార్తీకా నెలలో పౌర్ణమి అనంత‌రం నాలుగు రోజుల తరువాత వ‌చ్చే వేడుక ఈ కార్వాచౌత్‌‌. ఈ ఏడాది కార్వా చౌత్ నవంబర్ 4న వచ్చింది. తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ రోజున మ‌హిళ‌లు ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజ‌ల అనంత‌రం చంద్రుడు వ‌చ్చాక ఓ జ‌ల్లెడ తెర‌చాటు నుంచి త‌మ‌ భ‌ర్తను చూస్తారు. అయితే ఈ కార్వా చౌత్ సందర్భంగా యువ‌తులు, మ‌హిళ‌లు త‌మ చేతుల‌ను గోరింటాకుతో అందంగా అలంక‌రించుకుంటారు. రేప‌టి కార్వాచౌత్‌ ఉత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఢిల్లీలోని స‌రోజిని న‌గ‌ర్ మార్కెట్‌లో మ‌హిళ‌లు త‌మ చేతుల‌కు మెహందీని అలంక‌రించుకుంటున్నారు. ‌