బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 15:36:12

నక్సల్స్‌తో ఆమెకు లింకులున్నాయి..

నక్సల్స్‌తో ఆమెకు లింకులున్నాయి..

హైదరాబాద్‌:  పాకిస్థాన్‌ జిందాబాద్‌ అని నినాదాలు చేసిన యువతి అమూల్యకు నక్సల్స్‌తో లింకు ఉన్నట్లు కర్నాటక సీఎం యడ్యూరప్ప ఆరోపించారు. గురువారం బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజ్‌పైకి వచ్చిన అమూల్య.. పాక్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసింది. ఆ కార్యక్రమంలో ఎంపీ ఓవైసీ కూడా పాల్గొన్నారు. పాక్‌ జిందాబాద్‌ అన్న ఆ మహిళపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ యువతిని శిక్షించాలని సీఎం యడ్డీ అన్నారు. కాళ్లు, చేతులు నరికివేయాలని కన్న తండ్రే చెప్పాడని, ఆమెకు బెయిల్‌ ఇవ్వకూడదని, ఆమెను ఎవరూ రక్షించలేరని సీఎం యడ్డీ అన్నారు.  అమూల్య లాంటి వాళ్లను రెచ్చగొడుతున్న గ్రూపులను వెంటనే కట్టడి చేయాలన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, అప్పుడే ఆమె వెనుక ఉన్న వారు తెలుస్తారన్నారు. అమూల్యకు నక్సల్స్‌తో లింకులు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు.  22 ఏళ్ల అమూల్య ఇటీవల తన ఫేస్‌బుక్‌ పేజీలో కొన్ని వ్యాఖ్యలు పోస్టు చేసింది. దేశం ఏదైనా .. అన్ని దేశాలు బాగుండాలని కామెంట్‌ చేసింది.  లాంగ్‌ లివ్‌ ఇండియా, లాంగ్‌ లివ్‌ పాకిస్థాన్‌, లాంగ్‌ లివ్‌ బంగ్లాదేశ్‌.. అంటూ కొన్ని దేశాల పేర్లతో కన్నడ భాషలో పోస్టు పెట్టింది.  


logo
>>>>>>