గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 12:46:17

అసెంబ్లీ ముందు నిప్పు అంటించుకున్న మ‌హిళ‌.. గాయాల‌తో మృతి

అసెంబ్లీ ముందు నిప్పు అంటించుకున్న మ‌హిళ‌.. గాయాల‌తో మృతి

హైద‌రాబాద్‌: అయిదు రోజుల క్రితం యూపీ అసెంబ్లీ ముందు ఓ మ‌హిళ త‌న శ‌రీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న‌ది.  అయితే తీవ్ర గాయాల‌పాలైన‌ ఆ మ‌హిళ  ఇవాళ ఉద‌యం ల‌క్నో సివిల్ హాస్పిట‌ల్‌లో మృతిచెందింది.  అమేథీలో ప‌క్కింటి వారితో ఏర్ప‌డ్డ వివాదంలో త‌ల్లీకూతుళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చారు. కానీ పోలీసులు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన సాఫియా అనే మ‌హిళ‌.. ల‌క్నోలోని అసెంబ్లీ ముందు నిప్పు అంటించుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. ఆమె కూతురు గుడియాకు కూడా స్వ‌ల్ప స్థాయిలో శ‌రీరం కాలిపోయింది. 

త‌ల్లీకూతుళ్ల‌పై అమేథీలో కొంద‌రు వ్య‌క్తులు ఓ వివాదంలో దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డంలో ఆల‌స్యం చేశారు. మ‌ళ్లీ దాడి జ‌ర‌గ‌డంతో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో వాళ్లు అసెంబ్లీ ఎదుట ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించారు. ఈ కేసులో అమేథీకి చెందిన ముగ్గురు పోలీసుల్ని స‌స్పెండ్ చేశారు. బీజేపీ ప్ర‌భుత్వం పేద‌ల బాధ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత అనూప్ ప‌టేల్ రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే.. ఆ మ‌హిళ అసెంబ్లీ ముందు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు ల‌క్నో పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.logo