బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 11:39:54

సూర్యకిరణాలతో పెయింటింగ్‌ : వీడియో వైరల్‌

సూర్యకిరణాలతో పెయింటింగ్‌ : వీడియో వైరల్‌

పెయింటింగ్‌ అనగానే.. చేతిలో కుంచె, ఎదురుగా కాన్వాస్‌, పక్కనే రకరకాల రంగులు. ఇదే గుర్తొస్తుంది. వీటిలో ఏ ఒకటి మిస్‌ అయినా పెయింటింగ్‌ వేయడం అసంభం. ఈ వీడియోను చూస్తే అభిప్రాయం మార్చుకోవడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. ఒక మహిళ కాన్వాస్‌ ముందు నిల్చుని సాక్షాత్తు సూర్యకిరణాలనే కుంచెగా మలుచుకున్నది. చేతిలో ఒక ప్లాస్టిక్‌ లాంటి కవర్‌ పట్టుకొని అద్భుతాన్ని సృష్టిస్తున్నది. వివిధ పరిమాణాల్లో ఉన్న బూతద్దాలతో బొమ్మలను గీస్తూ ఔరా అనిపిస్తున్నది. ఈ వృత్తి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నది. తన చిన్నప్పుడు తండ్రి వడ్రంగిగా పనిచేసేవాడు. ఆ సమయంలో మిగిలిపోయిన చెక్క దుంగలపై బూతద్దాల సాయంతో చిత్రాలను గీయడం మొదలుపెట్టింది. దీన్నే వృత్తిగా మలుచుకున్నానని సోషల్‌మీడియాలో పేర్కొన్నది. పేరు, ఏ ప్రాంతానికి చెందినదో తెలియాల్సి ఉంది. 


logo