e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు పాత‌ర : పెండ్లి వేడుక‌లో మ‌హిళా త‌హ‌సిల్ధార్ డ్యాన్స్

కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు పాత‌ర : పెండ్లి వేడుక‌లో మ‌హిళా త‌హ‌సిల్ధార్ డ్యాన్స్

కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు పాత‌ర : పెండ్లి వేడుక‌లో మ‌హిళా త‌హ‌సిల్ధార్ డ్యాన్స్

భువ‌నేశ్వ‌ర్ : ఒడిషాలో క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన నియంత్ర‌ణ‌ల‌ను ఉల్లంఘిస్తూ ఒడిషా అడ్మినిస్ట్రేష‌న్ స‌ర్వీస్ అధికారిణి త‌న సోద‌రుడి వివాహ వేడుక‌లో పాట‌ల‌కు అనుగుణంగా డ్యాన్స్ చేయ‌డం క‌ల‌కలం రేపింది. సోదరుడి పెండ్లి వేడుక‌లో మ‌హిళా అధికారి డ్యాన్సులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో జ‌జ్పూర్ జిల్లా క‌లెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి సింగ్ రాధోడ్ స్పందించారు.

మ‌హిళా త‌హ‌సిల్ధార్ ప్ర‌స్తుతం సెల‌వుపై ఉన్నార‌ని, విధుల్లో చేరిన త‌ర్వాత వివ‌ర‌ణ కోరతామ‌ని..ఆపై ఆమె వివ‌ర‌ణ ఆధారంగా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. కొవిడ్ లాక్డౌన్ నిబంధ‌న‌లను ఏ ఒక్క‌రూ ఉల్లంఘించ‌రాద‌ని అన్నారు. అధికారులైనా, ప్ర‌జ‌లైనా నియంత్ర‌ణ‌లు పాటించి తీరాల‌న్నారు. సుకింద త‌హ‌సిల్దార్ గా ప‌నిచేస్తున్న‌మ‌హిళ డ్యాన్సింగ్ వీడియోలో ఫేస్ మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించ‌కుండా డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్-19 నిబంధ‌న‌ల‌కు పాత‌ర : పెండ్లి వేడుక‌లో మ‌హిళా త‌హ‌సిల్ధార్ డ్యాన్స్

ట్రెండింగ్‌

Advertisement