శుక్రవారం 10 జూలై 2020
National - Jun 30, 2020 , 19:57:27

పెట్రోల్ బంక్ వ‌ద్ద మ‌హిళ అయోమ‌యం : వీడియో వైర‌ల్‌!

పెట్రోల్ బంక్ వ‌ద్ద మ‌హిళ అయోమ‌యం : వీడియో వైర‌ల్‌!

ఒక‌రు అమాయ‌క‌త్వం మ‌రొక‌రికి న‌వ్వు తెప్పిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటిదే.. ఒక అమ్మాయి త‌న కారుకు పెట్రోల్ కొట్టించ‌డానికి నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటుంది. ఈ సంఘ‌ట‌న‌ను ఎదురుగా ఉన్న‌వాళ్లు వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.

“నేను : పరిపూర్ణ ఇంటర్నెట్ వీడియో ఉనికిలో లేదు” అనే శీర్షికతో రాస్ మార్టిన్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇందులో అంత‌గా న‌వ్వుకునే విష‌యం ఏంటంటే.. పెట్రోల్ కొట్టించాలంటే.. క‌రెక్ట్ డైరెక్ష‌న్‌లో కారును ఆపాలి. అయితే.. అది ఎలా పెట్టాలో అర్థం కాక అక్క‌డున్న అన్నిచోట్ల కారు పార్క్ చేసింది. ఫైన‌ల్‌గా ఐదోసారి ఆమె కారును స‌రిగ్గా పార్క్ చేసే మార్గాన్ని క‌నుగొన్న‌ది. ఈ క్ర‌మంలో ఆమెను చూసి అక్క‌డున్న వారంతా న‌వ్వుకున్నారు. వీడియో చూసి మీరు కూడా న‌వ్వుకోండి. చూసిన‌వారంతా మీమ్స్‌తో కామెంట్లు పెడుతున్నారు. 

 


logo