ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 02:23:55

పట్టపగలు యువతి దారుణ హత్య

పట్టపగలు యువతి దారుణ హత్య

ఫరీదాబాద్‌: పరీక్ష రాసి ఇంటికి వస్తున్న నిఖితా తోమర్‌ (21) అనే ఓ విద్యార్థినిని ఇద్దరు యువకులు రోడ్డు పై అటకాయించారు. అందులో ఒకడు కార్లోకి ఎక్కమని యువతిని బలవంత పెట్టాడు. దీనికి ఆమె నిరాకరించడంతో తుపాకీతో కాల్చి పరారయ్యాడు. సోమవారం పట్టపగలు హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. యువతిని కాల్చిన ప్రధాన నిందితుడు తౌసీఫ్‌తో పాటు అతనికి సాయం చేసిన  రెహాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు