శనివారం 11 జూలై 2020
National - Jun 29, 2020 , 18:26:48

అప్ప‌టి పెంగ్విన్ వీడియో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతుంది!

అప్ప‌టి పెంగ్విన్ వీడియో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతుంది!

స‌ముద్రంలో వ‌చ్చే అల‌ల‌కు అందులో ఉన్న జీవులు ఒక్కోసారి ఒడ్డుకు వ‌చ్చి చేరుతాయి.  ఒడ్డున నీరు లేక‌పోవ‌డంతో ప్రాణాల‌తో గిల‌గిలా కొట్టుకుంటుంటాయి. అలా వ‌చ్చిన ఓ పెంగ్విన్‌ను త‌న నివాస స్థ‌లానికి చేర్చిందో మ‌హిళ‌. పెంగ్విన్ ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపే వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నంద ఈ చిన్న క్లిప్‌ను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను 2017లో కైకౌరా వైల్డ్‌లైఫ్ రెస్క్యూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు దీనిని నందా పోస్ట్ చేయ‌డంతో మ‌రింత హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. 'అల‌ల‌తో కొట్టుకు వ‌చ్చిన నాకు నువ్వు మ‌ళ్లీ పున‌ర్జ‌న్మ‌నిచ్చావు. నీకు ఏ విధంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకోవాలో అర్థం కావ‌ట్లేదు అని చెప్పిన‌ట్లుగా ఉంది పెంగ్విన్ చూపులు' అనే శీర్షిక‌ను నంద జోడించారు. ఈ వీడియోను 13 వేల మంది వీక్షించారు. 

 


logo