శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 16:19:38

కోర్టు గదిలో మహిళపై అత్యాచారం... నిందితుడి అరెస్టు

కోర్టు గదిలో మహిళపై అత్యాచారం... నిందితుడి అరెస్టు

ఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రూస్‌ అవెన్యూ కోర్టులో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. కోర్టు గదిలో సిబ్బంది ఒకరు 38 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని పేర్కొంటూ పోలీస్‌ కంట్రోల్‌ రూంకి ఫోన్‌ చేసింది. కోర్టు సిబ్బందిలో ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొంది.

మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్‌ 376 కింద నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై ఐపీ ఎస్టేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అదేవిధంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సంజయ్‌ భాటియా తెలిపారు. logo