ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 17:27:07

మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం

మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, బాందా జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ 24 ఏండ్ల మ‌హిళ‌పై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాందా జిల్లాలోని నారాయ‌ణి ఏరియాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉద‌యం పొలం ప‌నుల‌కు వెళ్లిన తండ్రి రాత్ర‌యినా తిరిగి రాక‌పోవ‌డంతో స‌ద‌రు మ‌హిళ తండ్రి జాడ కోసం వెతుకుతూ పొలం వైపు వెళ్లింది. 

అయితే మ‌హిళ ఒంటరిగా వెళ్తుండ‌టాన్ని గ‌మ‌నించిన ముగ్గురు వ్య‌క్తులు మార్గ‌మ‌ధ్య‌లో ఆమెను అట‌కాయించి స‌మీపంలోని నీటికుంట వ‌ద్ద‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తామ‌ని బెదిరించి వ‌దిలేశారు. అనంత‌రం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో నిందితులు ముగ్గురు పారిపోయారు. పోలీసులు కేసు న‌మోదుచేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo