శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 14:30:25

ఉద్యాన‌వ‌నంలో మిల్క్ బ్యూటీ మ్యూజిక్ వింటున్న జింక‌!

ఉద్యాన‌వ‌నంలో మిల్క్ బ్యూటీ మ్యూజిక్ వింటున్న జింక‌!

ఒక అమ్మాయి ఉద్యాన‌వ‌నంలో సంగీత వాయిద్యం వీణ‌ను ప్లే చేస్తున్న‌ది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఆ స‌మీపంలో ఒక జింక ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మ్యూజిక్ వింటున్న‌ది. వీడియోలో‌ జింకను చూస్తే శ్రావ్య‌మైన సంగీత గ‌మ‌నిక‌ల‌ను ఆస్వాదిస్తున్న‌ట్లు క‌నిపించింది. తీరా జింక అక్క‌డి నుంచి పారిపోయిన త‌ర్వాత చ‌ప్పుడు రావ‌డంతో ఆమె మేల్కొన్న‌ది. అప్ప‌టివ‌ర‌కు అక్క‌డ జింక ఉన్న‌ట్లు గుర్తించ‌లేదు.

క్లిప్‌లో వీణ వాయించే న‌వోమి ఎస్‌.వి కొన్నిరోజుల క్రితం ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసింది.  "ఒక జింక నా హార్ప్ సెషన్‌ను డిస్నీ చిత్రంగా మార్చింది" అని క్యాప్ష‌న్ జోడించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోను 120 కే మంది వీక్షించారు. ఈ వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. 'జంతువులు కూడా సంగీతాన్ని మెచ్చుకోగ‌ల‌వు'. 'ఇది సార్వ‌త్రిక భాష' అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


  

 


logo