శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 29, 2020 , 16:39:18

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ : ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా చింతగుప్ప అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. చింతల్నార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డ్యూల్డ్‌, మిన్పా గ్రామాల మధ్య ఎస్టీఎఫ్‌, డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని పరిశీలంచగా ఓ మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యమైంది. అదేవిధంగా సంఘటనా స్థలం నుంచి 303 రైఫిల్‌తో పాటు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి. సుందర్‌రాజ్‌ తెలిపారు. మృతిచెందిన మహిళా మావోయిస్టును ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు.