ఆదివారం 17 జనవరి 2021
National - Dec 02, 2020 , 17:56:44

రూ.4 ల‌క్ష‌ల రివార్డు ఉన్న మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు

రూ.4 ల‌క్ష‌ల రివార్డు ఉన్న మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు

కోరాపూట్ : ఓ మ‌హిళా మావోయిస్టు బుధ‌వారం పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ ఘ‌ట‌న ఒడిశా రాష్ర్టం మ‌ల్క‌న్‌గిరి జిల్లాలో బుధ‌వారం చోటుచేసుకుంది. క‌లిమెలా పోలీస్ స్టేష‌న్ ప‌రిధి కురుబ్ గ్రామానికి చెందిన ర‌మే మ‌ద్కామి అనే మ‌హిళా మావోయిస్టు జిల్లా ఎస్పీ ముఖేష్ కుమార్ భామూ ఎదుట లొంగిపోయింది. ఈమె మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడ‌ర్ అక్కిరాజు హ‌ర‌గోపాల్ అలియాస్ శ్రీ‌నివాస్ అలియాస్ ఎస్‌వీ అలియాస్ ఆర్‌కేకు ప్రొటెక్ష‌న్ టీంలో స‌భ్యురాలిగా ఉంది. ర‌మే త‌ల‌పై ఒడిశా ప్ర‌భుత్వం రూ.4 ల‌క్ష‌ల రివార్డు ప్ర‌క‌టించింది. లొంగిపోవ‌డంతో ఈ న‌గ‌దును రివార్డుగా ఇవ్వ‌డ‌మే కాకుండా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం పున‌రావాసం క‌ల్పించ‌నున్న‌ట్లు ఎస్పీ తెలిపారు. 16 ఏళ్ల వ‌య‌సులో 2013లో సీపీఐ(మావోయిస్టు) పార్టీలో చేరింది. 303 రైఫిల్ నుంచి ఇన్‌సాస్ రైఫిల్ చేబూనే వ‌ర‌కు ఎదిగింది. మ‌ల్కాన్‌గిరి జిల్లాలో ర‌మేపై 10 పెండింగ్ కేసులు ఉన్నాయి.