గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 17:37:34

కాలిన గాయాలతో మహిళా లెక్చరర్‌ మృతి

కాలిన గాయాలతో మహిళా లెక్చరర్‌ మృతి

ముంబయి : ఓ మహిళా లెక్చరర్‌ను వేధింపులకు గురి చేస్తూ.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బాధిత లెక్చరర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూసింది. వివరాల్లోకి వెళ్తే.. వార్ధా జిల్లాకు చెందిన అంకిత(25) అనే యువతి ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. అంకితకు రెండేళ్ల క్రితం నాగ్‌రాలే(27) అనే యువకుడు పరిచయం అయ్యాడు. అయితే కొంతకాలం నుంచి ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆ వ్యక్తిని అంకిత దూరం పెట్టింది. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న యువకుడు.. ఫిబ్రవరి 3వ తేదీన పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌లోని ఆరెంజ్‌ సిటీ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న యువతి సోమవారం ఉదయం 6:55 గంటలకు తుదిశ్వాస విడిచింది. అంకిత మృతితో ఆమె నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫిబ్రవరి 3వ తేదీనే నిందితుడు నాగ్‌రాలేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గత గురువారం వార్ధా జిల్లా విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.


logo
>>>>>>