ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 22:50:42

కారు లోయ‌లోప‌డి మ‌హిళ మృతి

కారు లోయ‌లోప‌డి మ‌హిళ మృతి

న్యూఢిల్లీ: ‌ఉత్త‌రాఖండ్‌లో దారుణం జ‌రిగింది. న్యూ టెహ్రీ జిల్లాలోని న‌రేంద్ర‌న‌గ‌ర్ ఏరియాలో బుధ‌వారం సాయంత్రం కారు అదుపుత‌ప్పి 200 మీట‌ర్ల లోతున్న‌ లోయ‌లో పడింది. ఈ ఘ‌ట‌న‌లో కీర్తిన‌గ‌ర్ ఏరియాలోని జిర్కోటి గ్రామానికి చెందిన 37 ఏండ్ల‌ మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. కారు డ్రైవ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. రిషికేష్‌-చాంబా-గంగోత్రి జాతీయ ర‌హ‌దారిలోని బ‌గ‌ద్ ధార్ వ‌ద్ద ప్ర‌మాదం చోటుచేసుకుంది.

ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ డ్రైవ‌ర్‌ను చికిత్స కోసం రిషికేష్‌లోని ఎయిమ్స్‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించి, మ‌హిళ మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించారు. కారు కీర్తిన‌గ‌ర్ నుంచి ఢిల్లీకి వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo