మంగళవారం 31 మార్చి 2020
National - Mar 04, 2020 , 01:54:32

కవలల అనంతర కాన్పుకు..

కవలల అనంతర కాన్పుకు..
  • ‘ప్రసూతి ప్రయోజనాలు వర్తించవు’

చెన్నై: ఉద్యోగం చేసే మహిళకు తొలి కాన్పులో కవలలు జన్మించిన పక్షంలో తర్వాతి కాన్పునకు ప్రసూతి ప్రయోజనాలు వర్తించవని మద్రాసు హైకోర్టు తెలిపింది. అది రెండో కాన్పు అయినప్పటికీ పుట్టిన బిడ్డను మూడో సంతానంగానే పరిగణించాలని పేర్కొంది. ఓ మహిళా ఉద్యోగినికి తమిళనాడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 180 రోజుల సెలవును వర్తింపజేస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ సవాల్‌ చేసింది. దీనిపై న్యాయమూర్తులు ఏపీ సాహి, సుబ్రమణ్యంలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘తొలి కాన్పులో కవలలు జన్మిస్తే, వారు పుట్టిన సమయం మధ్య వ్యతాసాన్ని బట్టి రెండు కాన్పులుగా గుర్తించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 


logo
>>>>>>