గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 16:39:34

రెస్క్యూ బోటులో పుట్టిన ఆడ బిడ్డ‌

రెస్క్యూ బోటులో పుట్టిన ఆడ బిడ్డ‌

పాట్నా: వ‌ర‌ద‌ల‌తో నీట మునిగిన ప్రాంతం నుంచి ఒక గ‌ర్భిణీ మ‌హిళ‌ను రెస్క్యూ బోటులో త‌ర‌లిస్తుండ‌గా ఆమె అందులోనే ప్ర‌స‌వించింది. పండంటి ఆడ బిడ్డ‌కు ఆమె జ‌న్మ‌నిచ్చింది. బీహార్ రాష్ట్రంలో ఆదివారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు చంపారన్ జిల్లాలోని లోత‌ట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. దీంతో జాతీయ విప‌త్తు ప్ర‌తిస్పంద‌న ద‌ళాలు (ఎన్డీఆర్ఎఫ్‌) ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఒక నిండు గ‌ర్భిణీని రెస్క్యూబోటులో తీసుకెళ్తుండ‌గా ఆమెకు నొప్పులు ఎక్కువై అందులోనే ప్ర‌స‌వించింది. ఒక ఆడ శిశువున‌కు జ‌న్మ‌నిచ్చింది. అనంత‌రం త‌ల్లీబిడ్డ‌ను అంబులెన్సులో ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వారిద్ద‌రి ఆరోగ్యం బాగానే ఉన్న‌ద‌ని వైద్యులు తెలిపారు. 


logo