బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 17:52:11

సీఎం కార్యాలయం ఎదుట తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

సీఎం కార్యాలయం ఎదుట తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

లక్నో:  భూ వివాదం కేసులో పోలీసులు తమకు న్యాయం లేదని ఆరోపిస్తూ ఉత్తప్రదేశ్‌ రాజధాని లక్నోలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట శుక్రవారం తల్లీకూతుళ్లు నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు మంటలార్పి బాధితులను చికిత్స నిమిత్తం లక్నోలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) నవీన్ అరోరా తెలిపారు. అమేథి జిల్లా జామో ప్రాంతానికి చెందిన వారిగా వీరిని గురించామని పేర్కొన్నారు.

కాలువ వివాదంలో తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అవతలివారితో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆక్షేపించారు. మే 9న తల్లీకూతుళ్లు వారి పొరుగువారితో కాలువ విషయంలో గొడవపడ్డారు. ఇరువర్గాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశాం. సమగ్ర విచారణకు ఆదేశించామని అమేథి సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) ఖ్యాతిగార్గ్ శనివారం తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుపడ్డాయి. పేదల సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ)ని నిర్మించిన ఘనత సమాజ్‌వాది పార్టీది. సమస్యల పరిష్కారానికి వివక్ష లేకుండా ప్రజలందరూ అక్కడికి వెళ్చొచ్చు. కానీ ప్రభుత్వం పేదల సమస్యలు పట్టించుకునే స్థితిలో లేదు’ అని ట్వీట్ చేశారు.

సీఎం కార్యాలయం ఎదుట తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు యత్నించడం బాధాకరం. ఘటనను తీవ్రంగా పరిగణించి బాధితులకు న్యాయం చేయాలి. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’ అని బీఎస్పీ అధినేత మాయావతి ట్వీట్ చేశారు.


logo