శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 19:55:24

ల‌వ‌ర్‌ను భ‌ర్త‌గా పేర్కొన్న మ‌హిళా కానిస్టేబుల్‌.. క‌లిసి క్వారంటైన్‌

ల‌వ‌ర్‌ను భ‌ర్త‌గా పేర్కొన్న మ‌హిళా కానిస్టేబుల్‌.. క‌లిసి క్వారంటైన్‌

మ‌హారాష్ర్ట : ప‌్రియుడితో క‌లిసి ఉండేందుకు అతన్ని అధికారుల‌కు భ‌ర్త‌గా ప‌రిచ‌యం చేసి క‌లిసి క్వారంటైన్‌లో ఉంది ఓ మ‌హిళా కానిస్టేబుల్‌. ప్రియుడి భార్య పోలీసు ఫిర్యాదుతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మ‌హారాష్ర్ట‌లోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి.

త‌న తోటి పోలీస్ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో అవివాహిత మ‌హిళా పోలీస్ కానిస్టేబుల్ ను అధికారులు క్వారంటైన్ కు త‌ర‌లించారు. ఆమె ప్రైమ‌రీ కాంటాక్ట్ అడ‌గ‌గా ప్రేమికుడిని భ‌ర్త‌గా పేర్కొంటూ అధికారుల‌కు వివ‌రాలు తెలిపింది. దీంతో అధికారులు వీరిరువురిని క‌లిపి పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌లోని క్వారంటైన్ కు త‌ర‌లించారు. అంతా బాగానే సాగుతుండ‌గా క‌థ మ‌లుపు తిరిగింది. 

భ‌ర్త మూడు రోజులైనా ఇంటికి రాక‌పోయే స‌రికి వివాహితుడైన స‌ద‌రు వ్య‌క్తి భార్య విచార‌ణ చేప‌ట్టింది. ఆమెకు త‌న భ‌ర్త వేరే మ‌హిళ‌తో క‌లిసి క్వారంటైన్‌లో ఉన్న విష‌యం తెలిసింది. త‌న‌ను క‌లిసేందుకు పీటీసీకి వెళ్ల‌గా అక్క‌డి గార్డ్స్ ఆమెను అనుమ‌తించ‌లేదు. దీంతో తన భర్తపై బజాజ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విష‌యాన్ని తెలిసింది.

దీనిపై విచార‌ణ చేయాల్సిందిగా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ద‌ర్యాప్తు చేసిన డీసీపీ స‌ద‌రు వ్య‌క్తిని మ‌రొక క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. మ‌హిళా కానిస్టేబుల్, పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేసే వ్య‌క్తి ఇద్ద‌రూ ప్ర‌భుత్వ ప్రాజెక్టు ప‌నిమీద గ‌తేడాది అక్టోబ‌ర్‌లో క‌లుసుకున్నారు. 


logo