బుధవారం 08 జూలై 2020
National - Jun 04, 2020 , 13:14:41

కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో మహిళ ఆత్మహత్య

కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో మహిళ ఆత్మహత్య

కొల్లాం : కేరళలోని కొల్లాంలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో తనకు తానుగా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను వెల్లడిస్తూ మృతురాలిని సత్యవతిగా గుర్తించినట్లు తెలిపారు. పుత్తులం సర్వీసు కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తుంది. ఉద్యోగం విషయంలో సమస్యలు ఉన్నట్లుగా పలువురు పేర్కొన్నారు. కాగా ఆత్మహత్యకు అసలు కారణం ఏంటని తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.


logo