శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 18:02:06

అర‌టిపండుతో చింపాంజీకి ప‌ళ్లు తోమిన మ‌హిళ : వీడియో వైర‌ల్‌

అర‌టిపండుతో చింపాంజీకి ప‌ళ్లు తోమిన మ‌హిళ :  వీడియో వైర‌ల్‌

చిన్న‌పిల్ల‌లు నిద్ర లేచిన త‌ర్వాత బ్ర‌ష్‌‌ చేయాలంటే మారం చేస్తారు. వాళ్ల‌కి ఆ మాటా ఈ మాటా చెప్పి ఎలా గోలా ప‌ని కానిచ్చేస్తారు. ఇలా ఒక్క‌రోజు అయితే స‌రే. ప్ర‌తిరోజూ చేయాల్సిన ప‌ని క‌దా. అందుకే వారు ఏడ్వ‌కుండా బ్ర‌ష్ చేయాలంటే ఈ వీడియో చూపించండంటూ ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

29 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ఒక మ‌హిళ చింపాంజీకి బ్రెష్ చేపిస్తున్న‌ది. అదేంటి అన్ని తెలిసిన  మ‌నుషులే బ్ర‌ష్ చేయాలంటే ఏడుస్తారు అలాంటిది ఇదెలా చేపించుకుంటుంది అనుకుంటున్నారా?  దీనికి వారు అర‌టిపండుతో బ్రెష్ చేపించారు. ఆ పండుని తినేద్దాం అని చింపాంజీ ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఆమె మాత్రం ప‌ళ్లు తేమేసింది. ఎందుకంటే అది నిజ‌మైన అర‌టిపండు కాదు. ఆ ఆకారంలో ఉండే బ్ర‌ష్‌. ఐడియా బాగుంది క‌దా. అందుకే నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. 

  


logo