సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 12:37:46

పాక్ జిందాబాద్‌.. యువ‌తిపై దేశ‌ద్రోహం కేసు

పాక్ జిందాబాద్‌.. యువ‌తిపై దేశ‌ద్రోహం కేసు

హైద‌రాబాద్‌:  బెంగుళూరులో పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన ఓ యువ‌తిపై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆమె ఆ నినాదాలు చేసింది.  ఆ స‌భ‌లో ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. అయితే ఆ మ‌హిళ చేసిన నినాదాల‌కు త‌మ‌కు సంబంధం లేద‌ని ఎంపీ ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చారు.  అమూల్య అనే యువ‌తి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో అరిచింది.  ఓవైసీతో పాటు మ‌రో వ్య‌క్తి కూడా అప్పుడే ఆమెను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.  ఆమె వ‌ద్ద నుంచి మైక్రోఫోన్ కూడా లాక్కున్నారు.  సెడిష‌న్ సెక్ష‌న్ 124ఏ, 153ఏ,బీల  ప్ర‌కారం ఆ యువ‌తిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.  అమూల్య లియోన్ వ‌య‌సు 24 ఏళ్లు. బెంగుళూరులో ఆమె జ‌ర్న‌లిజం చ‌దువుతున్న‌ది. చిక్‌మంగ‌ళూరు జిల్లాలోని కొప్పా ఆమె స్వ‌గ్రామం. హ‌మ్ భార‌త్ కే లోగ్ గ్రూపులో ఆమె స‌భ్యురాలు.   


logo