శుక్రవారం 29 మే 2020
National - Jan 20, 2020 , 17:03:22

బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి మహిళపై సామూహిక అత్యాచారం

బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి మహిళపై సామూహిక అత్యాచారం

తమిళనాడులోని వేళ్లూరులో గడిచిన శనివారం నాడు దారుణ సంఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వేళ్లూరు పట్టణ కేంద్రం మధ్యలో ఉన్న కోట సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితులు మహిళ బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది వారి యువతిపై అత్యాచారం చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న వస్తువులను సైతం అపహరించుకుపోయారు. అత్యాచారం, దోపిడి కేసులు నమోదు చేసిన పోలీసులు 18 ఏళ్ల వయస్సున ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

చెన్నై: తమిళనాడులోని వేళ్లూరులో గడిచిన శనివారం నాడు దారుణ సంఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వేళ్లూరు పట్టణ కేంద్రం మధ్యలో ఉన్న కోట సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితులు మహిళ బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది వారి యువతిపై అత్యాచారం చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న వస్తువులను సైతం అపహరించుకుపోయారు. అత్యాచారం, దోపిడి కేసులు నమోదు చేసిన పోలీసులు 18 ఏళ్ల వయస్సున ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. 


ప్రభుత్వ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018లో భారత్‌లో ప్రతీ 15 నిమిషాలకు ఓ అత్యాచార ఘటన చోటుచేసుకున్నట్లు ఓ మహిళ పేర్కొంది. కేంద్ర హోంశాఖ రిపోర్ట్‌ ప్రకారం 2018లో మొత్తం 34 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. కానీ ఈ సంఖ్య వాస్తవానికి ఇంకా ఎక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు.


logo