గురువారం 09 జూలై 2020
National - Apr 06, 2020 , 02:25:35

తబ్లీగీ వల్లే వేగంగా రెట్టింపు

తబ్లీగీ వల్లే వేగంగా రెట్టింపు

-దేశంలో 4.1 రోజుల్లోనే కరోనా కేసులు డబుల్‌ 

-సదస్సు జరుగకుంటే 7.4 రోజులు పట్టేది: కేంద్రం

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి హజరైన వ్యక్తుల కారణంగా గత 4.1 రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయిందని, లేకుంటే 7.4 రోజుల సమయం పట్టేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొత్తగా 505 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో కేసుల సంఖ్య 3,577కు, మృతుల సంఖ్య 83కి పెరిగిందన్నారు. 274 మంది కోలుకున్నట్టు చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో తబ్లిగీ లింకులు బయటపడుతున్నాయి. గత నెలలో తమకు చెందిన నాలుగు విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికులందరు కచ్చితంగా క్వారంటైన్‌కు వెళ్లాలని ఎయిర్‌ ఇండియా సూచించింది. ఈ విమానాల్లో ప్రయాణించిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఈ సూచన చేసింది. మరోవైపు తబ్లిగీ సమావేశాలకు హాజరైన ఎనిమిది మంది మలేషియా పౌరులు దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు ఏపీలో ఒక్కరోజే 23 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 226కు పెరిగింది. ఏపీ నుంచి తబ్లిగీ సమావేశాలకు వెళ్లినవారిలో ఇంకా 30 మంది ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. 

జిల్లాకో కరోనా పరీక్షల ల్యాబ్‌

జిల్లా కేంద్రాల పరిధిలో కరోనో వైరస్‌ నిర్ధారణకు టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) అడ్వైజరీ జారీచేసింది. 


logo