శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 02:26:27

బలగాల ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదు

బలగాల ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదు

  • విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీ వాస్తవ

న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌లో భారత్‌, చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీ వాస్తవ తెలిపారు. రెండు రోజుల క్రితం చైనా.. బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిందని ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పష్టతనిచ్చారు. సరిహద్దు వద్ద శాంతి స్థాపనలో పురోగతి ఉన్నదని చెప్పారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై రెండు దేశాలకు చెందిన సీనియర్‌ కమాండర్లు త్వరలోనే చర్చలు జరుపుతారని తెలిపారు. ద్వైపాక్షిక చర్చల ద్వారానే సరిహద్దుల వద్ద శాంతి స్థాపనకు కట్టుబడి ఉంటామని ఆయన  ఈ సందర్భంగా అన్నారు. 


logo