శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 17:24:13

ప్రత్యేక రైళ్లతో రూ.45 కోట్ల ఆదాయం

ప్రత్యేక రైళ్లతో రూ.45 కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: రాష్ర్టాల రాజధానుల నుంచి ఢిల్లీకి ప్రయాణికుల ప్రత్యేక రైళ్లను మే 12 నుంచి కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నది. ఈ ఏసీ రైళ్లకు సంబంధించింది ఇప్పటివరకు 2,34,411 మంది ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకున్నారని రైల్వే శాఖ ప్రకటించింది. తద్వారా రూ.45.30 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంలో దేశవ్యాప్తంగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 51 రోజుల తర్వాత గత మంగళవారం నుంచి 15 ప్రత్యేక ప్యాసింజర్‌ రైళ్లను ప్రభుత్వం నడుపుతున్నది. వీటికి సంబంధించిన టికెట్లను మే 11 తేదీ నుంచి అమ్మడం ప్రారంభించింది. అదేవిధంగా ఈ వారం చివర్లో దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తిచేస్తున్నది.


logo