గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 16:29:23

మాస్కు ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ..

మాస్కు ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ..

బెంగళూరు : కరోనా మహమ్మారి సంక్రమణ క్రమంలో కర్నాకటలో విద్యార్థులు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సెకండరీ స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌సీ) పరీక్షకు హాజరవుతున్నారు. సోమవారం మూడో రోజు పరీక్ష కొనసాగగా, విద్యార్థులు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటిస్తున్నారు. కాలబురిగిలోని గవర్నమెంట్‌ వుమెన్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అంధ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. శివమొగ్గలో డీవీఎస్‌, నేషనల్‌ కళాశాలల్లోనూ పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద హ్యాండ్‌ శానిటర్‌ అందుబాటులో ఉంచడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కేంద్రాలకు వచ్చారు.

పోలీసు అధికారులు సైతం కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో గురువారం నుంచి కర్నాటకలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో గత 24గంటల్లో 19,459 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 380 మంది మరణించారు. ఇప్పటి వరకు 5,48,318 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2,10,210 మంది చికిత్స పొందుతుండగా, 3,27,723 మంది కోలుకోగా, మొత్తం 16,475 మంది మృతి చెందారు.


logo