సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:18:41

వీడియోకాల్‌లో డాక్ట‌ర్ సూచ‌న‌లు.. గ‌ర్భిణి సుఖ‌ప్ర‌స‌వం

వీడియోకాల్‌లో డాక్ట‌ర్ సూచ‌న‌లు.. గ‌ర్భిణి సుఖ‌ప్ర‌స‌వం

బెంగ‌ళూరు : వీడియో కాల్‌లో ఓ వైద్యురాలు సూచించిన సూచ‌న‌ల‌తో గ‌ర్భిణికి సుఖ ప్ర‌స‌వం చేశారు. ఈ సంఘ‌ట‌న క‌ర్ణాట‌కలోని హ‌వేరి జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. హ‌న‌గ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన వాస‌వి అనే గ‌ర్భిణికి ఆదివారం పురిటినొప్పులు సంభ‌వించాయి. దీంతో భ‌ర్త రాఘ‌వేంద్ర.. మ‌ధులిక దేశాయి, అంకిత, జ్యోతి మాదికి త‌న భార్య‌కు పురిటినొప్పులు వ‌స్తున్నాయ‌ని తెలిపాడు. హుటాహుటిన వారు వాస‌వి వ‌ద్ద‌కు చేరుకున్నారు.

ఇక రాఘ‌వేంద్ర అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. క‌నీసం 30 నుంచి 45 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంబులెన్స్ సిబ్బందికి రాఘవేంద్ర‌కు స‌మాచారం ఇచ్చారు. గ‌ర్భిణికి పురిటినొప్పులు అధిక‌మ‌వుతున్నాయి. అంబులెన్స్ రావ‌డం లేదు. దీంతో తెలిసిన గైన‌కాల‌జీ డాక్ట‌ర్  ప్రియ‌ద‌ర్శిని మంతాగికి రాఘ‌వేంద్ర ఫోన్ చేశాడు. తాను వాట్సాప్ వీడియో కాల్ చేస్తాన‌ని రాఘ‌వేంద్ర‌కు డాక్ట‌ర్ ధైర్యం చెప్పింది. ఆ త‌ర్వాత వీడియో కాల్ చేసి.. అక్క‌డున్న మ‌హిళ‌ల‌కు సూచ‌న చేసింది డాక్ట‌ర్. ప్రియ‌ద‌ర్శిని సూచ‌న‌ల‌తో వాస‌వికి సుఖ ప్ర‌స‌వం చేశారు మ‌హిళ‌లు. ఆ త‌ర్వాత అంబులెన్స్ లో త‌ల్లీబిడ్డ‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌ల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. 


logo