బెంగాల్‘ ఔట్‌సైడర్ ట్యాగ్ తొలిగింపునకు బీజేపీ పాట్లు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులేస్తున్నది. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. శని, ఆదివారాల్లో బెంగాల్ పర్యటనను పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాతే శనివారం ఉదయం బెంగాల్ రాజధాని కోల్‌కతాలో అడుగు పెట్టారు.
తద్వారా బీజేపీ బయటి పార్టీ అని ముద్ర వేయడానికి పశ్చిమబెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు చెక్‌పెట్టే వ్యూహాన్ని కమలనాథులు అమలు చేస్తున్నారు. గత నెల ఆరో తేదీ మాదిరిగానే శనివారం అమిత్‌షా బెంగాల్ పర్యటన వ్యూహాత్మకంగా రూపుదిద్దుకున్నది. తద్వారా బెంగాలీల్లో సెంటిమెంట్ పండించేందుకు భారీ కసరత్తే చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే లక్ష్యంతో శనివారం మిడ్నాపూర్‌లోని ఖుదీరాం బోస్ పురాతన ఇంటికివెళ్లి ఆయన విగ్రహానికి అమిత్‌షా పూలమాల వేశారు. ఆ వెంటనే పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ‘ఖుదీరాం బోస్ బెంగాల్ వాసి కాకున్నా.. భారతీయుడు అని చౌకబారు రాజకీయాలు చేస్తున్నవారు తెలుసుకోవాలి’ అని మమతనుద్దేశించి వ్యాఖ్యానించారు.
‘చరిత్రలో ఇదే రోజు 1927 డిసెంబర్ 19వ తేదీన స్వాతంత్య్ర సమరయోధులు రాం ప్రసాద్ బిస్మిల్, అస్ఫాఖుల్లాఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లను బ్రిటన్ వలస ప్రభుత్వం ఉరి తీసింది. కుదీరాం బోస్ మాదిరే రాంప్రసాద్ బిస్మిల్ ఉత్తరప్రదేశ్ వాసి అయినా బెంగాల్ వాసిగానే పరిగణిస్తారు. కనుక బీజేపీ బయటి పార్టీ అని చౌకబారు రాజకీయాలు చేస్తున్న వారు ఆ పని మానుకుంటే మంచిది’ అని అమిత్‌షా శనివారం వ్యాఖ్యానించారు.
‘ఈ స్వాతంత్య్ర సమరయోధుల మాదిరిగా దేశం కోసం ప్రాణాలర్పించేందుకు మనకు అవకాశం లేదు. కానీ ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో శక్తిమంతమైన భారత నిర్మాణానికి వారు అవకాశం కల్పించారు’ అని అన్నారు. ‘బెంగాల్ ముద్దుబిడ్డలు గురుదేవ్ ఠాగూర్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీలకు శిరస్సు వంచి నమన్కరిస్తున్నా‘ అని ట్వీట్ చేశారు.
ఆ వెంటనే కోల్‌కతాలోని స్వామి వివేకానంద పురాతన ఇంటిని సందర్శించి ప్రార్థనలు చేశారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల తర్వాత స్వామి వివేకానంద ఇంటిని అమిత్‌షా సందర్శించడం ఇది రెండోసారి. స్వామి వివేకానంద ఇంటిని సందర్శించిన తర్వాత అమిత్‌షా మీడియాతో మాట్లాడారు.
‘స్వామి వివేకానంద ఇంట్లో ప్రార్థనలు చేయడం నాకు ప్రత్యేకమైన హక్కు. ప్రతి ఒక్కరిలో స్పృహను రేకెత్తించిన ప్రాంతం ఇది. అమెరికాలో జరిగిన ఆధ్యాత్మిక మహాసభలో సనాతనధర్మం ప్రాముఖ్యతను స్వామి వివేకానంద ఎలా వివరించారో మనకు తెలుసు. అధ్యాత్మికతను ఆధునికతతో అనుసంధానించిన స్వామి వివేకానంద మనకు గర్వ కారణం. ఆయన భారత మాత గురించి చెప్పారు. మెరుగైన ప్రపంచం కోసం ఆయన మార్గాన్ని అనుసరించాలి’ అని వ్యాఖ్యానించారు.
స్వామి వివేకానంద ఇంటిని సందర్శించిన తర్వాత బోల్పూర్లోని ఠాగూర్ నివాస ప్రాంతాన్ని అమిత్‌షా సందర్శించడం ద్వారా ‘ఔట్ సైడర్’ అని మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహం అమలుకు ప్రయత్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష