గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 14:50:39

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

 ఢిల్లీలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కరోనా  వైరస్‌ మరింత భయపెడుతున్నది. రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో ఢిల్లీలో 422 కొత్త కేసులు నమోదవడం అధికారుల భయానికి కారణమవుతున్నది. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 9,755 కు చేరిందని ఢిల్లీ ప్రభుత్వ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ వెల్లడించింది. ఆదివారం వరకు 276 మంది కలుపుకొని మొత్తం 4,202 మంది వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, 148 మంది మృతిచెందగా.. ఇంకా 5,405 మంది వివిధ క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో మరణించినవారిలో 50 ఏండ్లలోపు వారు 31 ఉండగా.. 50-59 ఏండ్లలోపు వారు 40 మంది, 60 ఆపైన వయసు వారు 77 మంది ఉన్నారు. ఎయిమ్స్‌ సహా ఏడు కేంద్రాల్లో కరోనా వైరస్‌కు చికిత్స అందిస్తున్నారు.


logo