మంగళవారం 07 జూలై 2020
National - May 03, 2020 , 16:56:05

ఢిల్లీలో 384 కరోనా కేసులు

ఢిల్లీలో 384 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 384 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4122కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ వెల్లడించారు. ఇందులో 1256 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ ప్రభావంతో 64 మంది మృతిచెందారు. ఇంకా 2802 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

సీఆర్‌పీఎఫ్‌ ప్రధాన కేంద్రంలో పనిచేసే డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. దీంతో స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌, డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌తో సహా మొత్తం 40  మంది సిబ్బందిని స్వీయ నిర్బంధానికి తరలించారు. 


logo