శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 20:40:05

జమ్ముకశ్మీర్‌లో 16 వేలు దాటిన కరోనా కేసులు

జమ్ముకశ్మీర్‌లో 16 వేలు దాటిన కరోనా కేసులు

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో పాటిజివ్‌ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం కశ్మీర్‌లో 353 కేసులు నమోదుకాగా చికిత్సకు కోలుకొని 508 మంది రోగులు డిశ్చార్జి అయినట్లు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం తెలిపింది. ఇవాళ నమోదైన కేసుల్లో 129 మంది జమ్ముకు చెందినవారు కాగా 224 మంది కశ్మీర్ డివిజన్కు చెందిన వారు. శుక్రవారం మహమ్మారి కారణంగా 14 మంది మృతి చెందారు.

జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకు 16,782కు కరోనా కేసులు నమోదు కాగా 9,217 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 49,310 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,40,135 కేసులు నమోదుకాగా 12,87,945 మంది చికిత్సకు కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 740 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 30,601కు చేరింది.


logo