గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 20:19:08

బీహార్‌లో కొత్తగా 2,605 కరోనా కేసులు

బీహార్‌లో కొత్తగా 2,605 కరోనా కేసులు

పాట్నా : బీహార్‌లో ఆదివారం కొత్తగా 2,605 కొత్తగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో  38,919 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 24,520 మంది రోగులు డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. రికవరీ రేటు 67.52 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని చెప్పింది. కాగా, రాజధాని నగరం పాట్నా ఇప్పటి వరకు గరిష్ట సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాట్నాలోని ఎయిమ్స్, నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఎన్‌ఎంసీహెచ్) రెండు కొవిడ్ -19 ఆసుపత్రులుగా మార్చారు. పాట్నా తర్వాత భాగల్పూర్, గయా, తూర్పు చంపారన్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఇద్దరు సభ్యుల బృందం 500 పడకల తాత్కాలిక కొవిడ్‌-19 దవాఖాన ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం కోసం ముజఫనగర్‌ జిల్లా పర్యటిస్తున్నారు. ఆదివారం మూడో రోజు పర్యటన కొనసాగించారు. ఈ దవాఖాన ఉత్తర బీహార్‌లోని కరోనా బాధితుల కోసం అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. డీఆర్డీఓ బృందం ముజఫర్‌నగర్‌లో నాలుగు సైట్లను పరిశీలించింది. చక్కర్‌ మైదాన్‌, ముజఫర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), పటాహి విమానాశ్రయం, జహన్‌పహ సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ను పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్‌ మేజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ తెలిపారు. 15 రోజుల్లో దవాఖాన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ 500 పడకలు, కనీసం 150 వెంటిలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo