మంగళవారం 14 జూలై 2020
National - Apr 28, 2020 , 16:43:21

భారత్‌లో 30వేలకు చేరువలో కరోనా కేసులు

భారత్‌లో 30వేలకు చేరువలో కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1543 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 29,435కు చేరింది. 24 గంటల వ్యవధిలో 684 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 23.3%గా ఉంది.  ఇప్పటి వరకు 6,864 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. మంగళవారం సాయంత్రం వరకు కరోనా వల్ల ఇప్పటివరకు 939 మంది మృతిచెందారు.  గత కొన్ని రోజుల నుంచి కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 


logo