మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 10:09:30

ఢిల్లీలో ఒకే రోజు 104 క‌రోనా మ‌ర‌ణాలు

ఢిల్లీలో ఒకే రోజు 104 క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ : ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. బుధ‌వారం రికార్డు స్థాయిలో 8,593 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 85 మంది చ‌నిపోయారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 104 మంది చ‌నిపోయిన‌ట్లు ఢిల్లీ వైద్యాధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒకేరోజు 100కు పైగా క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. ఈ ఏడాది జూన్ 16న 93 మంది క‌రోనాతో మృతి చెందారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ సంఖ్య‌ను అధిగ‌మించ‌డం ఇదే తొలిసారి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 7,053 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య 4,67,028కి చేరింది. గ‌త వారం రోజుల నుంచి ఢిల్లీలో 7 వేల‌కు త‌గ్గ‌కుండా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఢిల్లీలో చలికాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేల వ‌ర‌కు చేరొచ్చ‌ని జాతీయ వ్యాధి నియంత్ర‌ణ కేంద్రం అభిప్రాయ‌ప‌డింది. క‌రోనా కేసుల పెరుగుద‌ల‌కు గాలి కాలుష్యంతో పాటు వాతావ‌ర‌ణ మార్పులు కూడా కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.