బుధవారం 08 జూలై 2020
National - Apr 01, 2020 , 16:35:29

క‌రోనాపై పోరుకు విప్రో, అజీం ప్రేమ్‌జీ రూ.1,125 కోట్ల విరాళం

క‌రోనాపై పోరుకు విప్రో, అజీం ప్రేమ్‌జీ రూ.1,125 కోట్ల విరాళం

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి పలు కార్పొరేట్ కంపెనీలు భారీ విరాళాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క‌రోనాపై పోరాటానికి త‌న వంతు సాయంగా అజీం ప్రేమ్‌జీ ముందుకు వ‌చ్చారు. రూ. 1,125 కోట్ల సాయం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు, విప్రో ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ. 25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేష‌న్ రూ. 1000 కోట్లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందిస్తున్న వైద్య, సేవా సిబ్బందితో పాటు బాధితుల‌కు చికిత్స, కరోనా నియంత్రణకు విరాళం ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే టాటా, రిల‌య‌న్స్ అధినేత‌లు భారీ విరాళాలు ప్ర‌క‌టించారు. విప్రో వార్షిక..కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధి నుంచి కాకుండా అదనంగా ఈ సాయాన్ని ప్రకటించామని, అలాగే ఫౌండేషన్‌ సాధారణ దాతృత్వ ఖర్చులతో సంబంధం లేకుండా ఫౌండేషన్‌ నుంచి కూడా అదనంగా విరాళం ఇస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.


logo