సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 20:43:39

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు లేనట్లేనా?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు లేనట్లేనా?

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈసారి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగకపోవచ్చని తెలుస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ మూడోసారి విజృంభిస్తున్న తరుణంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని కేంద్ర సీనియర్ మంత్రి ఒకరు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల లోపు సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నది. దీంతో సమావేశాల నిర్వహణ కోసం అంత తొందర లేదని ఆయన చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1కి ముందుగా జనవరి చివరి వారంలో ఏకంగా బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావచ్చని పేర్కొన్నారు. దీంతో ఈసారి శీతాకాల సమావేశాలు జరుగకపోవచ్చని తెలుస్తున్నది. 

కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చాలా ఆలస్యంగా సెప్టెంబర్‌ నెలలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను నిర్వహించారు. అయితే సెషన్‌ తొలి రోజే 17 మంది లోక్‌సభ, 8 మంది రాజ్యసభ సభ్యులకు కరోనా సోకింది. అనంతరం మరింత మంది పార్లమెంట్‌ సభ్యులు కరోనా బారినపడ్డారు. ఒక కేంద్ర మంత్రి కరోనాతో చనిపోయారు. ఈ నేపథ్యంలో నిర్ణయించిన షెడ్యూల్‌కు ముందుగానే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ముగించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి