బుధవారం 27 జనవరి 2021
National - Dec 03, 2020 , 16:01:22

కొడైకెనాల్‌లో గాలులతో వర్షం

కొడైకెనాల్‌లో గాలులతో వర్షం

చెన్నై : తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని కొడైకెనాల్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షం మొదలైంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం గురువారం మధ్యాహ్ననికి తుఫాను భారత ద్వీపకల్పంలోకి చేరింది. ఇవాళ రాత్రి, శుక్రవారం ఉదయం తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. తుఫాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను మోహరించారు. నేవికి చెందిన నౌకలతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌లను సహాయక చర్యల కోసం అందుబాటులో ఉంచారు. సముద్రం అల్లకోల్లంగా ఉండడంతో పశ్చిమ తీరంలో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుఫాను కారణంగా చిక్కుకుపోయిన పంబన్‌కు చెందిన ఇద్దరు మత్స్యకారుల్లో ఒకరిని అధికారులు రక్షించారు. 


logo