మంగళవారం 31 మార్చి 2020
National - Mar 21, 2020 , 20:13:46

రేపు ఇంట్లోనే ఉంటా: కర్ణాటక సీఎం

రేపు ఇంట్లోనే ఉంటా: కర్ణాటక సీఎం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు పూర్తిగా ఇంటికే పరిమితమవనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. మంత్రులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ, ప్రజలు గానీ ఎవ్వరూ రేపు తనను కలిసే ప్రయత్నం చేయకూడదని ఆయన విన్నవించారు. రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందుకనుణంగా కర్ణాటక సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రజలంతా స్వీయ సంరక్షణ పాటిస్తూ, బయటకు వెళ్లకుండా ఉంటే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చన్నది ప్రధాని ధ్యేయం. రేపు 14 గంటల పాటు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగస్వాములవ్వాలనీ.. తద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధాని సూచించారు. 


logo
>>>>>>