ఆదివారం 12 జూలై 2020
National - Jun 27, 2020 , 18:02:02

పబ్లిసిటే ఉపాధి కల్పిస్తుందా?' : ప్రియాంకాగాంధీ

పబ్లిసిటే ఉపాధి కల్పిస్తుందా?' : ప్రియాంకాగాంధీ

లక్నో : యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ సర్కారుపై కాంగ్రెస్‌ నాయకురాలు  ప్రియాంకా గాంధీ వాద్రా శనివారం విరుచుకుపడ్డారు. శుక్రవారం ప్రధాని మోడీ  ఆత్మనిర్బర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధి కార్యక్రమం చాలా ప్రచారంతో మొదలైంది’ అంటూ శనివారం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. కార్యక్రమంలో పేర్కొన్న కేటగిరిల్లో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్థిక సహాయం అందకపోవడంతో స్వయం ఉపాధి పొందుతున్న వారంతా సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు.

‘చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి ఉన్నదంటే.. ఓ అంచనా ప్రకారం ఎంఎస్‌ఎంఈలో 62శాతం ఉద్యోగాలు, 78శాతం వేతనాల వేతనాలు తగ్గిస్తారు’ అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో చికెన్‌ పరిశ్రమ, చెక్క పని, ఇత్తడి పరిశ్రమ, పవర్‌లూం రంగం, కార్పెట్ పరిశ్రమల పరిస్థితి దారుణంగా ఉందని ప్రియాంక తెలిపారు. ఇటీవల బుందేల్‌ఖండ్‌లో వలస కూలీలు, ఆర్థిక ఇబ్బందులు, ఉపాధిలేక కాన్పూర్‌లో ఆత్మహత్యలు చేసుకున్న విషాద సంఘటనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. 'ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం దాచేందుకు ప్రయత్నిస్తోంది? కేవలం పబ్లిసిటీ మాత్రమే ఉపాధి కల్పిస్తుందా?' అంటూ ప్రశ్నించారు. 


logo