సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 14:27:44

కరోనా ఎఫెక్ట్‌..హోలీ జరుపుకోవడం లేదు..

 కరోనా ఎఫెక్ట్‌..హోలీ జరుపుకోవడం లేదు..


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా నిర్వహించాలని ప్రపంచ దేశాల సూచనల నేపథ్యంలో తాను హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా (కోవిడ్‌-19) వణికిస్తోన్న నేపథ్యంలో హోలీ కానీ, హోలీ సంబంధించిన ఇతర వేడుకల్లో కానీ తాము పాల్గొనడం లేదని ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన అసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మరోవైపు ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో హోలీ సంబరాలకు దూరంగా ఉండాలని  ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయించారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎలాంటి వేడుకల్లో పాల్గొనరని వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 42 మంది చనిపోగా...200 మంది గాయపడిన విషయం తెలిసిందే. 


logo